సర్వేంద్రియానా౦ నయనం ప్రధానం ... అనే సత్యం మన
అందరికి తెలిసిందే ..అవయవ దహనాల్లో నేత్ర దానం చాల శ్రేష్టమైనది అని మన౦ ప్రతి
దిన౦ వింటున్నాం ... అదేవిధంగా అంతగొప్ప నేత్రాలను మన౦ చాల జాగ్రత్తగా
కాపాడుకుంటాం .... అయితే మన కనురెప్పలు తరచు తెరుచుకోవడం ... ముసుకోవడం అనే లక్షణం కలిగి ఉంటాయి
...ఇందుకు గల కారణం ఏంటో ఏ రోజైన తెలుసుకొనే ప్రయత్నం చేసారా ... అదేంటో ఇప్పుడు
చూద్దాం....Why do we have an eyelid?
కన్ను ఉపరితల భాగంలో సుమారు 10వ వంతు భాగం వాతావరణ పరిస్థితులకు, అందులో
వచ్చే మార్పులు,చేర్పులకు , దుమ్ము ధూళి
కి గురవుతుంటాయి. వీటించి రక్షణకై మనం మన కనురెప్పలను తరచు మూస్తూ తెరుస్తుంటం....ఈ
విధనగా కనురెప్పలను ప్రతిసారి మూస్తూ తెరుస్తూ ఉండటం వలన కన్ను యొక్క ఉపరితల భాగం
శుభ్రపడుతుంది.. కనురెప్ప ముసినప్పుడు ప్రతిసారి రెప్ప దిగువున ఉన్న గ్రంధుల నుంచి నీరు బయటకు వస్తుంది .. ఆ నీరు
ద్వార కన్ను యొక్క ఉపరితల శుభ్రపడుతుంది. సాధారణ౦గా ప్రతి మనిషి నిముషానికి 15
నుంచి 18 సార్లు కనురెప్పలు మూస్తూ తెరుస్తూ ఉంటారు .. అయితే ఏదన్నా టెన్షన్ లో
ఉన్నప్పుడు, లేదా అతిజాగ్రత్తగా ఏదన్నా గమనిoచ్చేటప్పుడు మన కనురెప్పలు నిముషానికి
ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే మూస్తూ తెరుస్తూ ఉంటాం .. అందువలన మన కన్ను యొక్క
ఉపరితలం మీద దుమ్ము ధూళి పేరుకుపోయి కళ్ళు మండటం , కంటి రెటీనా పాడవటం వంటి
సమస్యలు వస్తాయి ... కనురెప్పలు యొక్క మూస్తూ తెరవటం మీద జ్యాస ఉంచడం అన్నివిధాల
మనకు శ్రేయస్కరం ... 

0 comments:
Post a Comment